మెగాస్టార్ సినిమా కోసమే అంత డిమాండ్ చేస్తోందా ?

Published on Mar 25, 2020 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో నటించాల్సిన త్రిష సినిమా నుండి తప్పుకోవడంతో.. కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రెమ్యునిరేషన్ ను కాస్త ఎక్కువ అడిగింది అట. దాంతో ఈ సినిమాలో నటిస్తున్నందుకుగానూ కాజల్ కు కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ అందబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

మరి నిజంగానే కాజల్ కు అంత రెమ్యునరేషన్ ఇస్తే మాత్రం అది నిజంగా ఎక్కువే. ప్రస్తుతం ఫామ్ లో లేని హీరోయిన్ కి మెగాస్టార్ పక్కన ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. పైగా కోటిన్నర రూపాయలు ఇస్తూ అంటే కాజల్ లక్కినే. ఇక కరోనా దెబ్బకు ఈ సినిమా షూటింగ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.

మరోవైపు చిత్రంలో చరణ్ అతిధి పాత్ర చేస్తారనే టాక్ ఉన్నా ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ అందలేదు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More