ఆనందంతో ఉబితబ్బిబవుతున్న కాజల్.

Published on Feb 1, 2020 7:34 pm IST

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ప్రఖ్యాత సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూసియంలో ఆమె విగ్రహం ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈనెల 5వ తేదీన ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనితో ఇంకా కేవలం కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది అని కాజల్ సంబరపడిపోతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ నుండి మహేష్ బాబు, ప్రభాస్ వంటి నటుల విగ్రహాలు ఈ మ్యూజియం నందు ఏర్పాటు చేయడం జరిగింది. బాలీవుడ్ లో అమితాబ్, హ్రితిక్ , కాజోల్, కరీనా వంటి అనేక మంది నటుల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా ఈ లిస్టులో కాజల్ చేరింది. ఇక కాజల్ తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంతో పాటు, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :