అది నిజమైతే కాజల్ బంపర్ ఛాన్స్ కొట్టినట్లే..!

అది నిజమైతే కాజల్ బంపర్ ఛాన్స్ కొట్టినట్లే..!

Published on Apr 12, 2020 10:29 AM IST

Kajal Aggarwal

మెగా హీరోల ఫస్ట్ ఛాయిస్ గా కాజల్ అగర్వాల్ కొనసాగుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమాలో చరణ్ సరసన నటించి మెగా కాంపౌండ్ లోకి ఎంటరైన కాజల్ దాదాపు అందరు మెగా హీరోల సరసన నటించింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కాగా మరో మెగా హీరో పక్కన కాజల్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తనకు గబ్బర్ సింగ్ వంటి భారీ హిట్ ఇచ్చిన హరీష్ తో 28వ చిత్రం ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ కి జోడిగా కాజల్ అగర్వాల్ ని అనుకుంటున్నారట. సినిమాలో పాత్ర రీత్యా కాజల్ అయితే బాగుంటుందని వారు భావిస్తున్నారట. గతంలో కాజల్ సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కి జోడిగా నటించింది. ఒక వేళ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కితే కాజల్ కి బంపర్ ఆఫర్ దక్కినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు