ఎట్టకేలకు ఆ హీరో తో నటించనున్న కాజల్ !

Published on Apr 3, 2019 2:11 pm IST

టాలీవుడ్ లో సీనియర్ , జూనియర్ హీరోలు అన్న తేడా లేకుండా దాదాపు అందరితోనూ సినిమాలు చేసింది కాజల్. అయితే ఒక్క గోపిచంద్ తో మాత్రం ఆమె ఇంత వరకు నటించలేదు. ఇక ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రానుందని వార్తలు వస్తున్నాయి.

సాహసం తరువాత గోపిచంద్ తో బివిఎఎస్ యెన్ ప్రసాద్ నిర్మించనున్న చిత్రం ఇటీవలే ఫార్మల్ గా లాంచ్ అయ్యింది. నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం డైరెక్ట్ చేయనున్నఈ చిత్రంలో గోపి కి జోడీగా కాజల్ ను తీసుకున్నారట. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :