తుఫానుకు ముందు నిశ్శబ్దం అంటున్న చందమామ.!

Published on Oct 30, 2020 4:05 pm IST

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎందరో యువతకు ఆల్ టైం క్రష్ కాజల్ అగార్వల్ ఇప్పుడు పెళ్లి కూతురు అయ్యిపోయింది. పెళ్లి కళ ఎప్పుడో వచ్చేసినా తన కెరీర్ పైనే దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అందుకుంది. అలా మన టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ హీరోయిన్ గా నిలిచిన కాజల్ ఎట్టకేలకు పెళ్లి కూతురు కావడంతో ఆ వాతావరణం అలా అలముకుంది.

అయితే ముంబై కు చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లు భార్యగా ఇంకొన్ని గంటల్లో మారనుంది. దీనితో ఇప్పుడు కాజల్ ఇంట పెళ్లి సందడి ఓ రేంజ్ లో ఉంది. అయితే కాజల్ కు సంబంధించి ఎప్పటికప్పుడు పెళ్లి కూతురు అప్డేట్స్ వస్తున్నాయి. అలా తన మెహందీ అనంతరం ఓ ఫోటో పెట్టి “తుఫానుకు ముందు నిశ్శబ్దం గా ఉండాలి” అన్నట్టుగా ఓ పోస్ట్ పెట్టారు. బ్లాక్ అండ్ వైట్ లో చేతికి మెహందీ, గాజులు, పాపిట బిళ్ళతో పెళ్లి కూతురుగా ప్లెసెంట్ గా కనిపించింది ఈ చందమామ. ఎట్టకేలకు పెళ్ళికి రెడీ అయిన ఈ చందమామకు ఆమెకు కాబోయే భర్తకు మనం కూడా మన విషెష్ తెలియజేద్దాం.

సంబంధిత సమాచారం :

More