ప్రభాస్ తో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

ప్రభాస్ తో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

Published on Jul 5, 2021 7:04 AM IST

యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్”లో ఒక ఒక స్పెషల్ సాంగ్ ఉందనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించి అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సాంగ్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సాంగ్ కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ వచ్చే షెడ్యూల్ లో షూట్ చేస్తారట.

కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో హీరోయిన్ తమన్నా చేత ఒక స్పెషల్ సాంగ్ చేయించాడు ప్రశాంత్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం కాజల్ ను తీసుకున్నాడట. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.

అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాడట. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు