రామ్ చరణ్ సరసన మరోసారి కాజల్ అగర్వాల్.?

రామ్ చరణ్ సరసన మరోసారి కాజల్ అగర్వాల్.?

Published on Sep 29, 2015 11:20 AM IST

Kajal-ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇది చివరి దశలో ఉండగానే చరణ్ తన తదుపరి సినిమాకి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే తమిళంలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్లో లో రామ్ చరణ్ నటించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం రామ్ చరణ్ తో బ్రూస్ లీ సినిమాని నిర్మిస్తున్న డివివి దానయ్య ఈ సినిమా రీమేక్ రైట్స్ ని తీసుకున్నారు. ఆయన చరణ్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

కానీ రామ్ చరణ్ మరియు డివివి దానయ్య ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాజల్ తో చర్చలు కూడా జరిపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఖరారు కాకపోయినా ఈ కాంబినేషన్ అందరినీ చర్చించుకునేలా చేసింది. ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ – కాజల్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర, నాయక, ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ అంటే మరో హిట్టే అని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడితే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు