లోకనాయకుడితో కాజల్ ?

లోకనాయకుడితో కాజల్ ?

Published on Nov 1, 2018 3:57 AM IST

kajal kamal haasan
లోకనాయకుడు కమల్ హాసన్ ,క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ ‘భారతీయుడు 2’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ కథానాయికగా నటించనుందని చెన్నై సీని వర్గాల సమాచారం. ఇక కాజల్ చేతిలో ప్రస్తుతం 2చిత్రాలు మాత్రమే ఉన్నాయి. దాంతో ఈ సీనియర్ హీరో పక్కన నటించడానికి అంగీకరించిందట.

భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిచనుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం శంకర్ తన విజువల్ వండర్ 2.0 చిత్రాన్ని విడుదల చేసే పనిలో బిజీ గా ఉన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు