కళ్యాణ్ రామ్ సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన కాజల్ !

18th, December 2017 - 08:39:31 AM

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకవైపు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు యంగ్ హీరోలతోనూ, ‘క్వీన్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో ఆమె ఒక ఎన్నారైగా, బిలీనియర్ కుమార్తెగా కనిపించనుందట. అంతేగాక ఆమె పాత్రలో మంచి గ్లామర్ డోస్ కూడా ఉంటుందని అంటున్నారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.