తమిళ హీరో జయం రవి, నయనతార జంటగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తని ఒరువన్’. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 2015లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈసినిమాను 2106లో రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈసినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది.
ఇక ఇటీవల మోహన్ రాజా ఈ చిత్ర ఒరిజినల్ వర్షన్ తని ఒరువన్ కి సీక్వెల్ తెరకెక్కిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈచిత్రంలో జయం రవి కి జోడిగా ప్రముఖ హీరోయిన్ కాజల్ ను తీసుకోనున్నారని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం యువ కథానాయిక సాయేషా కూడా పోటీ పడుతుందట. మరి ఈ ఇద్దరిలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి.


