బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్, హీరో అజయ్ దేవగన్ బాలీవుడ్ లో బెస్ట్ స్టార్ కపుల్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ బెస్ట్ కపుల్ తమ గారాల కూతురు నీసా దేవగన్ ని సర్‌ప్రైజ్ చేసే మంచి కాస్టలీ గిఫ్ట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే అజయ్ – కాజోల్ కుమార్తె నీసా దేవగన్ ప్రస్తుతం సింగపూర్‌లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్‌లో చదువుకుంటుంది.
కాగా తమ కూతురు హాస్టల్ లో ఉండి చదువుకోవడం ఇష్టం లేక, సింగపూర్‌లోని కాస్ట్‌లీ ఏరియా ఆర్చర్డ్ రోడ్ లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ని కొని గిఫ్ట్ ఇచ్చారట ఈ బెస్ట్ కపుల్. ఇక త్వరలోనే నీసా దేవగన్ తన తల్లిదండ్రులు ఇచ్చిన అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్ అవ్వనుంది. కాజోల్ ఇటీవలే ‘హెలికాప్టర్ ఈలా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ చిత్రంలో కాజోల్ మంచి తల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.


