సింగం, స్పెషల్ 26.. కాజల్ అగర్వాల్ హిందీలో నటించిన రెండు సినిమాలు సూపర్ సక్సెస్ సాదించాయి. అయినా కాజల్ హిందీ సినిమాల వెంట పరుగులు పెట్టడం లేదు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా కాజ అగర్వాల్ ను మరో హిందీ సినిమా అవకాశం వరించింది.
ప్రముఖ దర్శకుడు సుదీర్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఔర్ దేవదాస్’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కాజల్ ను ఎంపిక చేశారు. మొదట ఈ పాత్ర కోసం చిత్రంగదా సింగ్ పేరును పరిశీలించారు. చివరకు లక్కీ ఛాన్స్ కాజల్ చెంతకు చేరింది. దర్శకుడు కాజల్ కు కథ వినిపించారు. ఆమెకు విపరీతంగా నచ్చిందని సమాచారం. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతుంది. అజోయ్ వర్మ దర్శకత్వంలో షర్మాన్ జోషి సరసన మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


