మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని గతకొంత కాలంగా అనుమానాలు నెలకొన్నాయి. చిరు నటించిన విశ్వంభర, కాకా రెండు చిత్రాలు కూడా సంక్రాంతి టార్గెట్ చేస్తున్నాయని వార్తలు రావడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే, ఎట్టకేలకు ఈ కన్ఫ్యూజన్‌కు మెగాస్టార్ అండ్ టీమ్ చెక్ పెట్టారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027న ‘కాకా’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా స్పష్టం చేశారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో చిరంజీవి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన పక్కన దర్శకుడు బాబీ, రచయిత కోన వెంకట్ కూడా ఉన్నారు. అంతేకాకుండా సినిమా ఫస్ట్ సింగిల్‌ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. కాకా టార్గెట్ సంక్రాంతి పైనే అంటూ వారు మరోసారి తమ రిలీజ్ డేట్‌ను పక్కాగా కన్ఫర్మ్ చేశారు.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా థామస్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి మెగా రికార్డులు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


