ఇంటర్వ్యూ : నిర్మాత దీప్తి గంటా – ‘అలియాస్ రుక్మిణి’లోని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి..!

ఇంటర్వ్యూ : నిర్మాత దీప్తి గంటా – ‘అలియాస్ రుక్మిణి’లోని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి..!

Published on Nov 27, 2026 11:01 PM IST

నేచురల్ స్టార్ నాని సమర్పణలో, నితిన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ‘అలియాస్ రుక్మిణి’. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో దీప్తి గంటా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా విశేషాలను నిర్మాత దీప్తి గంటా విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

‘దండోరా’ తీసిన దర్శకుడు చెప్పిన కథ కాబట్టి ఈ సినిమా చేశారా? లేక కథ నచ్చి ఓకే చేశారా?

‘అలియాస్ రుక్మిణి’ కథ చదువుతున్నప్పుడే నాకు బాగా నచ్చింది. అప్పటికి ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ దర్శకుడని నాకు తెలియదు. ఆ తర్వాత డైరెక్టర్ ఇచ్చిన రెండున్నర గంటల నరేషన్‌ను ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంజాయ్ చేశాను. కథ చాలా ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా, దర్శకుడు దాన్ని ముగించిన తీరు నన్ను ఎంతగానో హత్తుకుంది. అందుకే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. థియేటర్లలో ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఒక గొప్ప అనుభూతిని అందించబోతోంది.

నాని గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటుంది?

ముందుగా నాకు కథ నచ్చిన తర్వాతే నానికి వినిపిస్తాను. తనకు కూడా నచ్చితేనే ప్రాజెక్ట్ మొదలుపెడతాం. గతంలో వచ్చిన ‘కోర్ట్’ గానీ, ఇప్పుడు ఈ ‘అలియాస్ రుక్మిణి’ గానీ.. అలా కథ నచ్చి ఓకే చేసినవే.

ఈ సినిమాలో నితిన్ గారిని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?

ఈ కథకు నితిన్ అయితే బాగుంటుందని నాని సూచించారు. ఆ తర్వాత మేము వెళ్లి నితిన్ గారికి కథ చెప్పగానే ఆయనకు నచ్చి వెంటనే ఓకే చేశారు. ఇటీవలే నాని ఈ సినిమాను చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఆయన ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్ ముగించుకొని ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు.

డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్ గురించి?

దర్శకుడు మురళీకి తాను ఏం తీయాలనే దానిపై చాలా క్లారిటీ ఉంది. ఆయనకు ఇండస్ట్రీ లెక్కల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. తన మనసుకు ఏది అనిపిస్తే దాన్ని ఎంతో నిజాయితీగా రాస్తారు, అంతే స్పష్టతతో తెరకెక్కిస్తారు. ఆయన చాలా మంచి విజన్ ఉన్న దర్శకుడు.

‘అలియాస్ రుక్మిణి’ టైటిల్ గురించి?

రుక్మిణి అనే కలం పేరుతో తను కథలు రాస్తాడు. అసలు ఆ కలం పేరుతో ఎందుకు కథలు రాస్తున్నాడు అనేది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెన్సార్ జీరో కట్స్ తో సర్టిఫికేట్ ఇచ్చింది.

సాయికుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?

ఇందులోని ప్రతి పాత్ర మన ఇంట్లో ఉండే మనుషుల్లాగే చాలా సహజంగా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇక హీరోయిన్ కూడా చాలా చక్కగా నటించింది. ఆ పాత్రకు తను పర్ఫెక్ట్‌గా సరిపోయింది; ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహించి మరీ తనని ఎంపిక చేశాం.

డిసెంబర్ 4న నాగచైతన్య గారి ‘వృషకర్మ’ కూడా విడుదలవుతోంది కదా?/

డిసెంబర్ 4 విడుదలయ్యే సినిమాలకు చాలా కలిసొచ్చే తేదీ. పైగా ఆ నెలలో ప్రేక్షకులు హాలిడే మూడ్‌లో ఉంటారు కాబట్టి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. పోటీలో ఉన్న రెండు చిత్రాలూ వేర్వేరు జానర్స్ కావడంతో, ఆడియన్స్ రెండింటినీ కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

మీరు నెక్స్ట్ డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు?

ప్రస్తుతానికి ప్రొడక్షన్ బాధ్యతల నుంచి కొంచెం విరామం తీసుకుని, పూర్తిస్థాయిలో డైరెక్షన్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను.

తాజా వార్తలు