“క‌ళాకార్” ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్.!

Published on Jul 17, 2021 10:21 am IST

6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, నేను సీతామాలక్ష్మి, రత్నం, గాళ్ ఫ్రెండ్‌, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాల్లో హీరోగా నటించిన రోహిత్ అప్పట్లో యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌తో కూడా ఆకట్టుకున్న రోహిత్ తాజాగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ “కళాకార్‌” సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే షియాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు. అయితే తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను హీరో శ్రీ‌కాంత్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ క‌ళాకార్ అనే టైటిల్ బాగుందని, పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా రోహిత్ లుక్ బాగుందని, అందులో చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడని అన్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉందని ఈ సినిమా డెఫినెట్‌గా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

హీరో రోహిత్ మాట్లాడుతూ హీరో శ్రీ‌కాంత్ గారితో తనకు ఎప్ప‌టినుంచో మంచి అనుభందం ఉందని, ఆయన క‌ళాకార్ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. యాక్ష‌న్ అండ్ స‌స్పెన్స్ స‌బ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని అన్నారు.

దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ ఈ మూవీతో రోహిత్ ఒక డిఫ‌రెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడని, ఔట్‌పుట్‌ చాలా బాగా వ‌చ్చిందని అన్నారు. నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ కళాకార్‌ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసిన హీరో శ్రీ‌కాంత్‌గారికి ధ‌న్య‌వాదాలు అని, హీరో రోహిత్‌కు ఈ సినిమా ప‌ర్‌ఫెక్ట్ రీ ఏంట్రీ అవుతుందని, త్వరలోనే విడుద‌ల‌తేదిని ప్ర‌క‌టిస్తామని అన్నారు.

సంబంధిత సమాచారం :