కళ్యాణ్ రామ్-సతీష్ వేగేశ్నల మూవీ ప్రారంభం.

Published on Jun 20, 2019 4:23 pm IST

కళ్యాణ్ రామ్ తన తాజా చిత్రం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న తో ప్రారంభించేశారు. ఈ రోజు హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. మెహ్రీన్ పిర్జా కథానాయకిగా నటిస్తున్న ఈ మూవీ కళ్యాణ్ 17వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది.

కుటుంబకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీని శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తుండగా, గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. ఈ చిత్ర విజయం పై హీరో కళ్యాణ్ రామ్,దర్శకుడు సతీష్ వేగేశ్న గట్టి నమ్మకంతో ఉన్నారట. ఈ మూవీలో ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More