సమీక్ష : ‘కలియుగమ్ 2064’ – కొన్నిచోట్ల ఆకట్టుకునే సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా !

సమీక్ష : ‘కలియుగమ్ 2064’ – కొన్నిచోట్ల ఆకట్టుకునే సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా !

Published on May 9, 2025 9:04 PM IST

Kaliyugam 2064 Movie Review

విడుదల తేదీ : మే 09, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శ్రద్ధా శ్రీనాథ్, ఇనియాన్ సుబ్రమణి, కిషోర్ కుమార్, గార్యా లక్ష్మి, హరి, అస్మల్, హరి, మిథున్ తదితరులు.
దర్శకుడు : ప్రమోద్ సుందర్
నిర్మాణం: KS రామకృష్ణ
సంగీతం : డాన్ విన్సెంట్
సినిమాటోగ్రఫీ : కె రామ్‌చరణ్
ఎడిటర్ : నిమ్జ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

శ్రద్దా శ్రీనాథ్, కిషోర్.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్సన్, అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా ‘కలియుగమ్ 2064’. RK ఇంటర్నేషనల్ బ్యానర్ పై KS రామకృష్ణ నిర్మాణంలో ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా 2064లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో.. ఆహారం, నీరు దొరక్కపోతే ఎలా ఉంటుంది ?, ఆ పరిస్థితుల్లో మనుషులు తమ మనుగడ కోసం ఏ స్థాయికి దిగజారిపోతారు. ఆకలి, దాహం ముందు మానవత్వం కరువైపోతే, మనుషులు తమ విచక్షణ జ్ఞానం కోల్పోతే.. ఎలాంటి ఘోరాలకి పాల్పడతారు ? అనే కోణంలో ఈ కథ సాగింది. కండ, బుద్ధి బలం ఉన్న వాళ్ళు రెసిడెన్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ఆ రెసిడెన్స్ లోకి వెళ్లాలని బాలహీనులు పోరాడుతూ కలలు కంటూ ఉంటారు. శక్తి (కిషోర్) కూడా అలాగే ఆలోచిస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య శక్తికి సేఫ్ హౌస్ గురించి తెలుస్తోంది. ఆ సేఫ్ హౌస్ లోకి వెళ్తాడు. ఆ హౌస్ లో ఉండే థామస్ (ఇనియాన్ సుబ్రమణి) చాలా డిఫరెంట్ గా ఉంటాడు. ఐతే, ఆ హౌస్ లోనే శక్తి కథ ముగుస్తోంది. అదే హౌస్ ను వెతుక్కుంటూ వస్తోంది భూమి (శ్రద్ధా శ్రీనాథ్). మరి ఆ హౌస్ లో భూమి ఎన్ని కష్టాలు పడింది ?, థామస్ ఆమెను ఏం చేశాడు ?, చివరకు భూమి ఆ హౌస్ నుంచి బయట పడిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఊహకు అందదు. దర్శకుడు ప్రమోద్ సుందర్ రాసుకున్న ఫ్యూచర్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సప్సెన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ ను ఈ సినిమా కలిగించింది. కాగా శక్తి పాత్రలో కిషోర్ చాలా బాగా నటించాడు.

మరో కీలక పాత్రలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రలో ఇనియాన్ సుబ్రమణి కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అదేవిధంగా గార్యా లక్ష్మి బాగా నటించింది. ఆమె మేనరిజమ్స్ బాగున్నాయి. హరి తన పాత్రలో మెప్పించాడు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన అస్మల్, మిథున్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు తీసుకున్న మెయిన్ పాయింట్, అండ్ ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ సైన్స్‌ అండ్‌ ఫ్యూచర్ ఎలిమెంట్స్ ను లింక్ చేస్తూ రాసుకున్న కొన్ని సీన్స్ కొత్తగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

ఈ ‘‘కలియుగమ్ 2064’’ సినిమాలో ఇంట్రెస్టింగ్ థీమ్ ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే బోరింగ్ గా సాగుతుంది. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చే ఫ్యూచర్ కి కనెక్షన్ పెట్టి, ఆ కోణంలో క్లారిటీగా సీన్స్ ను రాసుకోకుండా కొన్నిచోట్ల సీన్స్ ను డైవర్ట్ చేశారు. నిజానికి కథనానికి అనుగుణంగా జరుగుతున్న డ్రామా పాయింట్ ఆఫ్ వ్యూలో బోలెడు సస్సెన్స్ ను మెయింటైన్ చేయవచ్చు. కానీ.. ఈ విషయంలోనూ సినిమా సింపుల్ గానే సాగింది.

ఇక విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం విచక్షణ జ్ఞానం కోల్పోతారని చూపించే సీన్స్ బాగున్నా.. కొన్ని సీన్స్ మాత్రం ఒకేలా సాగాయి. ఇక మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే కోణంలో వచ్చే సీన్స్ ను మాత్రం బాగా చూపించారు. మొత్తానికి దర్శకుడు ప్రమోద్ సుందర్ సినిమాని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గానీ, అది అక్కడక్కడ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ప్రమోద్ సుందర్ ఈ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే ఫ్యూచర్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో కె రామ్‌చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. డాన్ విన్సెంట్ సంగీతం పర్వాలేదు. నిమ్జ్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత KS రామకృష్ణ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘కలియుగమ్ 2064’లో.. మెయిన్ థీమ్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అయితే, కొన్ని సీన్స్ స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కాకపోతే, మనిషి ఆకలికి – మానవత్వానికి లింక్ చేస్తూ రాసుకున్న ఎమోషనల్ సీన్స్ కొత్తగా అనిపిస్తాయి, ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు