ఫుల్ యాక్షన్ మూడ్ లో సీనియర్ హీరో !

Published on May 1, 2019 4:00 am IST

‘కల్కి’ సినిమాలో రాజశేఖర్ యాక్షన్ సీన్స్ మరి ఎక్కువయ్యాయని.. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్ మూడ్ లోనే సాగుతుందని తెలుస్తోంది. మరి రాజశేఖర్ మీద మోతాదుకు మించిన యాక్షన్ వర్కౌట్ అవుతుందా. అయితే ఇటివలే విడుదల అయిన ఈ చిత్రం టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే.. సినిమా రొటీన్ కి భిన్నంగా ఉంది. దీనికి తోడు ప్రశాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిసినిమా థియేట్రికల్ హక్కులను కూడా కెకె రాధామోహన్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :