కల్కి కథ కూడా కాపీయేనా ?

Published on Jun 22, 2019 2:57 am IST

సినిమాలో ఇండస్ట్రీలో కథలు కాపీ అనేది కొత్త విషయమేమి కాదు, కానీ కాపీ చేయాల్సిన అవసరం లేకపోయినా మన దర్శకనిర్మాతలు కాపీ చేస్తారు. ఇదే సమస్య. సీనియర్ హీరో రాజశేఖర్ యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమా ‘కల్కి’. కాగా ఈ కథ ప్ర‌శాంత్ వ‌ర్మ అద్భుతంగా రాసాడని కూడా ఆ మధ్య ప్రెస్ మీట్ లో చిత్రబృందం చెప్పుకొచ్చింది.

కానీ తీరా చూస్తే.. కల్కి కథ ప్రసాద్ అనే రచయితది అంట. అతను ఇప్పటికే కథ తనది అని కేసు కూడా వేయడం జరిగింది. మరి ప్రసాద్ ఆరోపణల్లో నిజం ఎంత ఉందో చూడాలి. ఇక ప్రశాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గరుడవేగ చిత్రంలాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

ఇక ఈ సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More