‘సింగ్ గీతం’ కోసం కల్కి.. మాటతో పాట అంటున్న ప్రభాస్!

‘సింగ్ గీతం’ కోసం కల్కి.. మాటతో పాట అంటున్న ప్రభాస్!

Published on Jun 19, 2026 9:00 PM IST

ఇటీవల మన తెలుగు సినిమా నుంచి వచ్చిన వినూత్న ప్రయత్న చిత్రమే సింగ్ గీతం. భారతీయ సినిమా దగ్గర ఎన్నో వండర్స్ తీసిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అలా మాటతోనే పాటని సృష్టించి థియేటర్స్ లో అలరించిన టీం కోసం ఇప్పుడు కల్కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భాగం అవ్వడం జరిగింది.

ఈ సినిమా నిర్మాత అలాగే కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కలిసి చేసిన చిట్ చాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మాటతో పాట అంటూ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ అరిపించడం ఫ్యాన్స్ లో మంచి క్రేజీగా మారింది. ఇక ఇందులో ప్రభాస్ లుక్స్ కూడా మంచి స్టైలిష్ గా కనిపించడంతో ఈ ప్రోమో మరింత వైరల్ అయ్యింది. ఇక ఈ ఫుల్ ఇంటర్వ్యూ త్వరలోనే రానుంది అని వైజయంతి మూవీస్ వారు కన్ఫర్మ్ చేశారు. ఇక దేవిశ్రీప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు