‘కల్కి’ దిగబోయేది అప్పుడే !

Published on Jun 9, 2019 8:46 pm IST

‘గరుడవేగ’ తర్వాత సీనియర్ హీరో డా.రాజశేఖర్ చేస్తున్న చిత్రం ‘కల్కి’. ‘అ !’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని జూన్ నెలలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించిన టీమ్ ఇన్ని రోజులు రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సినిమా జూన్ 28న విడుదలవుతున్నట్టు ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన సినిమా కమర్షియల్ ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఆదా శర్మ, పూజిత పొన్నాడ, నందిత శ్వేత, స్కార్లెట్ మెల్లిష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రాజశేఖర్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More