టీజర్ తో రానున్న సీనియర్ హీరో !

Published on Apr 9, 2019 11:55 am IST

చాలా రోజుల తరువాత ‘గరుడ వేగ’ తో హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తన మొదటి చిత్రం ‘అవె’ తో ప్రశంసలు అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక రేపు ఉదయం 10:10 గంటలకు ఈచిత్రం యొక్క టీజర్ ను విడుదలచేయనున్నారు.

యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత శ్వేతా , ఆదా శర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం తో రాజశేఖర్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడతాడోలేదో చూడాలి.

సంబంధిత సమాచారం :