అంచనాలు పెంచుతోన్న ‘కల్కి’ టీజర్ !

అంచనాలు పెంచుతోన్న ‘కల్కి’ టీజర్ !

Published on Apr 10, 2019 11:20 AM IST


‘గరుడ వేగ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం నుండి ఈ రోజు ఉదయం 10:10 గంటలకు టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ చూస్తుంటే.. సినిమా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని అర్ధమవుతుంది.

ముఖ్యంగా టీజర్ లో కనిపించిన ప్రతి షాట్ సినిమా పై ఆసక్తితో అంచనాలను కూడా పెంచుతుంది. ప్రశాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గరుడవేగ చిత్రంలాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

వైవిధ్యమైన కథతో యాక్షన్ ఎంటర్టైనెర్ గా రాబోతున్న ఈ సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు