లవ్ సీన్స్ కోసం రెడీ అవుతోన్న క‌ల్యాణ్‌ దేవ్‌ !

Published on Nov 17, 2019 1:00 am IST

క‌ల్యాణ్‌ దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై రిజ్వాన్ నిర్మాత‌గా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘సూప‌ర్‌ మ‌చ్చి’. ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్‌ ను కూడా విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్ లో కొన్ని లవ్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈ సన్నివేశాలు సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

కాగా కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ఇక అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం పై కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More