కళ్యాణ్ రామ్ సినిమా విడుదల తేది ఫిక్స్ !
Published on Mar 5, 2018 12:20 pm IST

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్న సినిమా నా నువ్వే. కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమాకు . జయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టిజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

నా నువ్వే చిత్రాన్ని మే 25 విడుదల చెయ్యబోతున్నట్లుచిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమా తరువాత పవన్ సాదినేని దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.

 
Like us on Facebook