మా ఫ్యామిలీని సెపరేట్ చేసి చూడకండి – కళ్యాణ్ రామ్

మా ఫ్యామిలీని సెపరేట్ చేసి చూడకండి – కళ్యాణ్ రామ్

Published on Oct 11, 2015 11:52 AM IST

Kalyan-Ram

‘పటాస్’ సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలోనే ‘షేర్’ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. గతంలో కళ్యాణ్ రామ్ తో కత్తి అనే సినిమా తీసిన మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో నిన్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. చాలా స్టైలిష్ గా ఈ ఆడియో వేడుకని నిర్వహించారు.

ఈ ఆడియో వేడుకలో కళ్యాణ్ బాగా ఎమోషనల్ అయ్యి అభిమానులకు నందమూరి అభిమానులంతా ఒకటిగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘నందమూరి తారకరామారావు గారి వృక్షం నుంచి ముందుగా బాబాయ్, ఆ తర్వాత నాన్నగారు, తర్వాత తారక్, నేను వచ్చాము. ముందు ముందు చాలా మంది వస్తారు. మేమంతా ఒక కుటుంబం కానీ అభిమానులు మాత్రం మమ్మల్ని ఎందుకు వేరుచేసి చూస్తున్నారు. మేమేంతా ఒక కుటుంబం అయితే మమ్మల్ని ప్రేమించే అభిమానులంతా కూడా ఒక కుటుంబం లానే ఉండాలి, దయచేసి వేరువేరుగా చూడకండని’ కళ్యాణ్ రామ్ అన్నాడు. ఇదే విషయానికి నేను కూడా పూర్తి సపోర్ట్ ని ఇస్తానని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తెలిపాడు.

తాజా వార్తలు