నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా ‘పటాస్’. మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఇటివలే విడుదలైంది. ఆడియోతో పాటు విడుదలైన ట్రైలర్ కుప్రేక్షకుల నుండి అద్బుత స్పందన లభించింది. టైటిల్ అనౌన్స్మెంట్ నుండి ట్రైలర్ వరకూ ప్రేక్షకులలో సినిమాపై మంచి ఆసక్తి రేపింది.
‘పటాస్’ టైటిల్ పేరుకు తగ్గట్టు ట్రైలర్ గట్టిగా పేలింది. యంగ్ & ఎనర్జిటిక్ పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. సీరియస్ యాక్షన్ తో పాటు తనలో కామెడీ యాంగిల్ కూడా చూపించాడు. కెరీర్లో మొదటిసారి కళ్యాణ్ రామ్ ఈ తరహాక్యారేక్తర్ లో సందడి చేస్తున్నాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి సోది హీరోయిన్ గా నటిస్తుంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. ‘పటాస్’తో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు.
