హిట్ వచ్చింది.. స్పీడ్ పెంచాడు !

Published on Mar 10, 2019 2:56 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కే వి గుహన్ దర్శకత్వంలో ‘118’ చిత్రం మంచి అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అందించిన విజయానందంతో కళ్యాణ్ రామ్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు.

మల్లిడి వశిష్ట్ అనే దర్శకుడి చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందట. కథ నచ్చడంతో వెంటనే సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ నెల నాలుగో వారంలో ప్రారంభం కానుంది.

అయితే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది.. అలాగే మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక విభాగంకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More