పూరీ – కళ్యాణ్ రామ్ స్పెయిన్ షెడ్యూల్ డీటైల్స్

పూరీ – కళ్యాణ్ రామ్ స్పెయిన్ షెడ్యూల్ డీటైల్స్

Published on Jun 14, 2016 1:08 AM IST

puri-kalayan-ram
‘పటాస్’ సినిమాతో హీరోగా వచ్చిన కమర్షియల్ స్టేటస్‌ను ఆ తర్వాత వచ్చిన ‘షేర్‌’తో అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్, తాజాగా పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్లో ఇప్పటివరకూ పూరీ స్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కళ్యాణ్ రామ్, ఈ సినిమా కోసం చాలా కొత్త లుక్‌ను ట్రై చేసి ఆశ్చర్యపరిచారు. పూరీ స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక ఈ షెడ్యూల్ తర్వాత ఈ నెలాఖర్లో టీమ్ స్పెయిన్ బయలుదేరనుంది. జూలై 1 నుండి నెలరోజుల పాటు స్పెయిన్‌లో ఓ మేజర్ షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ షెడ్యూల్ కోసం పూరీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని సమాచారం. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు