
ఈ ఏడాది మొదట్లో వచ్చి అన్ని సెంటర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న పవర్ఫుల్ పోలీస్ ఎంటర్ టైనర్ ‘పటాస్’. ఈ సినేమాతి చాలా రోజుల తర్వాత యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కళ్యాణ్‌రామ్ తన తదుపరి సినిమా షూటింగ్ ‘షేర్’ని శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఈ సినిమాలోని చివరి సాంగ్ ని షూట్ చేస్తున్నారు.
కళ్యాణ్ రామ్ – సోనాల్ చౌహాన్ లపై వచ్చే ఈ పాటని బ్యాంకాక్, పటాయాలో షూట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కి గుమ్మడి కాయ కొట్టేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను స్పీదప్ చేసి ఆగష్టులో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. పటాస్ సినిమాలనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. మల్లికార్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. షేర్ లో మరోసారి కళ్యాణ్‌రామ్ పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇది కాకుండా కళ్యాణ్ రామ్ రవితేజ హీరోగా నిర్మించిన ‘కిక్ 2’ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్దమవుతోంది.

