ప్రమోషన్లు మొదలుపెట్టిన కళ్యాణ్ రామ్ !
Published on Jun 11, 2018 2:06 pm IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, తమన్నాలు జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. కళ్యాణ్ రామ్ తొలిసారి చేసిన పూర్తిస్థాయి రొఇమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే పలుసార్లు వాయిదాపడిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్ లోకి దిగారు.

వరుసగా టీవీ ఛానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా చిత్ర టీమ్ ఇంకా పలు రకాల భిన్నమైన ప్రచార కార్యక్రమాల్ని ప్లాన్ చేశారట. సినిమా చాలా కొత్తగా, క్లీన్ గా, అందరినీ ఆకట్టుకునే ప్రేమ కథగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook