బింబిసార 2 పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ !

Published on Aug 6, 2022 11:01 pm IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా చారిత్రక కథాంశంతో వచ్చిన ‘బింబిసార’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ ను రాబడుతుంది. అందుకే, ఇప్పుడు బింబిసార 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. అయితే, తన బింబిసార చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులకు కళ్యాణ్ రామ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన బింబిసార-2 పై క్లారిటీ ఇచ్చాడు.

బింబిసార పార్ట్-2 బెటర్ ఫాంటసీ, అత్యున్నత గ్రాఫిక్స్ హంగులతో భారీగా ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు వశిష్టపై ఆ బాధ్యత ఉందని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఈ విజయం తన పై కూడా మరింతగా బాధ్యతను పెంచిందని.. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిగారు సంగీతం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయిందని కళ్యాణ్ రామ్ చెప్పారు.

సంబంధిత సమాచారం :