‘ఓం 3డి’ సినిమా తర్వాత కొన్ని నెలల విరామం తీసుకుని కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా ‘పటాస్’. యువ రచయిత అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘పటాస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
‘పటాస్’ ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్ రఫ్ లుక్ అదిరింది. ఓ చేతిని స్టైలిష్’గా ఫ్యాంట్ పాకెట్’లో పెట్టుకుని.. మరో చేతిలో లాఠీతో కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించాడు. కళ్యాణ్ రామ్ పటాస్ ఫుల్ మాస్ అంటూ అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇటివల కాలంలో తెలుగుతెరపై వచ్చిన పోలీస్ కథలు అన్ని ఘనవిజయం సాదించాయి. పటాస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


