పోలీస్ ఆఫీసర్ పాత్రలో కళ్యాణ్ రామ్?

పోలీస్ ఆఫీసర్ పాత్రలో కళ్యాణ్ రామ్?

Published on May 11, 2014 12:15 PM IST

Kalyan_ram

ప్రస్తుతం టాలీవుడ్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలకి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. అలాగే అలా చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా కూడా నిలుస్తున్నాయి. మహేష్ బాబు ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాల్లో పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించి బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే కాకుండా ఇప్పుడు ‘ఆగడు’ సినిమాలో కూడా పోలీస్ గా కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అలాగే రవితేజ ‘విక్రమార్కుడు’ తో హిట్ అందుకొని మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా ‘పవర్’ సినిమా చేస్తున్నాడు.

ఇదే కోవలో ఇప్పుడు నందమూరి కళ్యాన్ రామ్ కూడా వచ్చి చేరాడు. గతంలో కళ్యాణ్ రామ్ ‘హరేరామ్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. మళ్ళీ ఇప్పుడు తను చేయనున్న ‘పటాస్’ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడని సమాచారం. ఈ సినిమా ఇటీవలే ఎన్.టి.ఆర్, సురేందర్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది.

‘కందిరీగ’, ‘ఆగడు’ సినిమాలకు రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు.

తాజా వార్తలు