ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ అంతా ప్రతి తమ అభిమానులను మెప్పించడానికి ప్రతి సినిమాలోనూ రొటీన్ కి భిన్నంగా ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు. కొంతమంది సినిమా సినిమాకి డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కన్పిస్తే, కొంతమంది డ్రెస్సింగ్ తో తన లుక్ ని మార్చుకొని కనిపిస్తే, కొంతమంది ఏమో తమ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఈ కోవలోనే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కొత్తగా ట్రై చేస్తున్నాడు.
విషయంలోకి వెళితే కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోప్లీస్ ఆఫీసర్ గా చేస్తున్న సినిమా ‘పటాస్’. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ లేని విధంగా తన డైలాగ్ డెలివరీలో కొత్త మాడ్యులేషన్ ని ట్రై చేసాడు. పటాస్ లో కాస్త మాస్ టచ్ ఉన్న డైలాగ్స్ ని సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్ లో చెప్పాడు. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శృతి సోది హీరోయిన్ గా కనిపించనుంది.


