నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘పటాస్’ గత నెల విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ అప్పుడే తన తదుపరి సినిమాతో సిద్దమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ చేస్తున్న తదుపరి సినిమా ‘షేర్’. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
పటాస్ సినిమాలనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కళ్యాణ్ రామ్ సరసన వన్య మిశ్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. మరోసారి కళ్యాణ్ రామ్ పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడు.


