‘మహా సముద్రం’లో కళ్యాణి ప్రియదర్శన్ ?

Published on Aug 2, 2020 3:00 am IST


డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో శ‌ర్వానంద్ కి జ‌త‌గా కళ్యాణి ప్రియదర్శన్ నటించబోతుందట. అజ‌య్ ఇప్పటికే కళ్యాణి ప్రియదర్శన్ కి కథ కూడా వివరించార‌ట. కళ్యాణి ప్రియదర్శన్ కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట. ఇక మొదట ఈ సినిమా నుండి మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. ఫైనల్ గా అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలోని మరో హీరో పాత్ర కోసం.. అజయ్ ఫామ్ లో ఉన్న మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఏమైనా “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమా కోసం మాత్రం అజేయ్ భూపతి బాగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More