హలో బ్యూటీ కి బంపరాఫర్ !

హలో బ్యూటీ కి బంపరాఫర్ !

Published on Feb 19, 2019 3:21 PM IST


హలో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్సిన మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా వుంది. అందులో భాగంగా తెలుగులో చిత్రలహరి , శర్వానంద్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ డ్రామాలో నటిస్తుండగా మళయాలంలో మరో రెండు చిత్రాలు చేస్తుంది. ఇక ఈ బ్యూటీ కి ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన నటించే అవకాశం వచ్చింది.

అభిమన్యుడు ఫేమ్ మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ తన 15వ చిత్రంలో నటించాల్సి వుంది. ఈ సినిమాకు కళ్యాణి ని హీరోయిన్ గా తీసుకున్నామని మేకర్స్ కంఫర్మ్ చేశారు. కోలీవుడ్ లో ఆమెకు ఇదే మొదటి చిత్రం. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ‘మిస్టర్ లోకల్’ సినిమాని పూర్తి చేసిన శివ కార్తికేయన్ ప్రస్తుతం తన 14వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు