‘ఎంత మంచివాడవురా’ కి క్లీన్ ‘యూ’ ఇచ్చారు.

Published on Jan 6, 2020 2:02 pm IST

ఈ ఏడాది సంక్రాంతి సినిమాలలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న చిత్రం ఎంత మంచివాడవురా. కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పల్లెటూరిలో ఉమ్మడి కుటుంబం, అనుబంధాలు నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. కాగా నేడు సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. కుటుంబ సమేతంగా ఇంటిల్లిపాది కలిసి చూడదగిన చిత్రంగా సెన్సార్ సభ్యులు సర్టిఫై చేశారు. దీనితో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 8న జే ఆర్ సి కన్వెన్షన్ హాల్ నందు గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా వస్తున్నారు. బ్యూటీ మెహ్రిన్ ఫిర్జా హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ అధినేతలైన ఉమేష్ గుప్తా, శుభాష్ గుప్తా ఈచిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

సంబంధిత సమాచారం :