మూడు సినిమాల్ని పూర్తిచేస్తానంటున్న కమల్ హాసన్ !

15th, February 2018 - 08:58:39 AM

విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21వ తేదీన ఆయన తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అదే రోజున మధురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడనున్నారు.

ఇదిలా ఉండగా కమల్ ఇకపై సినిమాలు చేయనని ప్రకటించడంతో కొంత నిరుత్సాహానికి గురైన అభిమానులు ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు ‘విశ్వరూపం-2, శభాష్ నాయుడు’, శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘ఇండియన్-2’ పరిస్థితేమిటని డైలమాలో పడ్డారు.

అయితే కమల్ ఈ మూడు సినిమాల్ని తప్పకుండా చేస్తానని, పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి దిగినప్పుడే సినిమాల నుండి పూర్తిగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. దీన్నిబట్టి కమల్ నుండి ఇంకో మూడు సినిమాల్ని పక్కాగా ఆశించవచ్చన్నమాట.