సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ప్రతి విషయంలోనూ తన విలక్షణతను చాటుకుంటూ దేశంలోని గొప్ప కళాకారుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డిఫరెంట్ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగులో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
తాజాగా ‘ఉత్తమ విలన్’ తెలుగు వర్షన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఉత్తమ్ విలన్ కోసం కమల్ హాసన్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఫస్ట్‌టైమ్ వర్షన్ నచ్చక రెండోసారి కూడా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. సాధారణంగా కమల్ సినిమాలకు ఎస్.పి.బాలసుబ్రమణ్యం లేదా మనోలు డబ్బింగ్ చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కమల్ డబ్బింగ్ చెప్పడం విశేషంగా కనిపిస్తోంది. ఆండ్రియా, పూజ కుమార్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరించారు.


