మణిరత్నంతో ఆ సినిమా మిస్ చేసుకున్న కమల్.!

మణిరత్నంతో ఆ సినిమా మిస్ చేసుకున్న కమల్.!

Published on Apr 18, 2025 5:58 PM IST

లెజెండరీ దర్శకుడు మణిరత్నం అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అప్పుడెప్పుడో ‘నాయకుడు’ సినిమా తర్వాత మళ్ళీ ఇపుడు మళ్ళీ “థగ్ లైఫ్” సినిమాతో రాబోతున్నారు. అయితే ఈ సినిమా లేటెస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా కమల్ తమ కాంబినేషన్ లో మిస్ అయ్యిన మరో సినిమా కోసం రివీల్ చేయడం జరిగింది.

మణిరత్నంతో హీరోగా కాకుండా నిర్మాతగా చేద్దామనుకున్న సినిమా కోసం తాను చెప్పారు. నిజానికి మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రాలు ‘పొన్నియిన్ సెల్వన్’ లను కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కించాల్సి ఉందట. కానీ ఆ సినిమాకి పెట్టాల్సిన బడ్జెట్ విని ఆ సినిమా నుంచి వెనక్కి వచ్చేసాను అని కమల్ అసలు విషయం తెలిపారు. దీనితో కమల్ నిర్మాతగా, మణిరత్నం దర్శకునిగా చేయాల్సిన సినిమా మిస్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు