‘థగ్ లైఫ్’ పై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేసిన కమల్ హాసన్!

‘థగ్ లైఫ్’ పై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేసిన కమల్ హాసన్!

Published on May 15, 2025 5:00 PM IST

Thug Life 1

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘థగ్ లైఫ్’. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పట్ల మంచి అంచనాలు ఇపుడు నెలకొన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కోసం సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ చేస్తున్నారు. ఇలా లేటెస్ట్ ప్రమోషన్స్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయటకి వచ్చింది.

ఈ సినిమా కథ నిజానికి కమల్ హాసన్ ది అని ఈ ప్రమోషన్స్ లో మొదట బయటకి వచ్చింది. అయితే మొదట ఈ సినిమాకి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ అనుకోలేదట. కమల్ హాసన్ ‘అమర్ హైన్’ టైటిల్ ని అనుకున్నారట. దీనికి అర్ధం చనిపోయాడు అనుకున్న మనిషి బ్రతికే ఉన్నాడు అనే కాన్సెప్ట్ తాను ఈ కథని రాసుకోగా అది మణిరత్నం దగ్గరకి వెళ్లి అయన స్టైల్ లో షేప్ అవుట్ చేసి ‘థగ్ లైఫ్’ గా సిద్ధం చేసినట్టు కమల్ హాసన్ అసలు విషయం రివీల్ చేశారు. మరి ఈ అవైటెడ్ సినిమా ఈ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు