కమల్ హాసన్ భారీ రెమ్యునరేషన్ లో నిజం లేదు !

కమల్ హాసన్ భారీ రెమ్యునరేషన్ లో నిజం లేదు !

Published on Sep 25, 2022 9:59 PM IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా ఈ సినిమా కోసం కమల్‌ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్‌ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ సినిమాకి గానూ కమల్ హాసన్ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో తెలుసా ?, ఏకంగా రూ.150 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారట. అయితే, ఈ రూమర్ లో ఏ మాత్రం నిజం లేదు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’ ప్రస్తుతం యాక్షన్ సీన్స్ షూట్ లో ఉంది. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ప్రెజెంట్ జిమ్ లో భారీ వర్కౌట్లు చేస్తోంది. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక భారతీయుడు 2 రన్ టైం 3 గంటలకు పైనే నిడివి ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ ఈ నిడివి ని కూడా తగ్గించే పనిలో ఉన్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు