లగ్జరీకి దూరంగా లోకనాయకుడు కమల్ హాసన్

లగ్జరీకి దూరంగా లోకనాయకుడు కమల్ హాసన్

Published on May 18, 2026 10:00 PM IST

స్టార్ హీరోలు సాధారణంగా లగ్జరీ లైఫ్‌ను, ప్రైవేట్ జెట్స్‌ను కోరుకుంటారు. కానీ, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత సినీ నిర్మాణంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఖర్చులను అర్థం చేసుకున్న ఈ లెజెండరీ నటుడు.. ఇకపై తన కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ చార్టర్స్, లగ్జరీ ట్రావెల్స్ వద్దని తేల్చి చెప్పాడు. తాజాగా ఆయన ఎలాంటి హంగులు లేకుండా, సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’కి సీక్వెల్‌గా వస్తున్న ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొనడానికి కమల్ హాసన్ ఈ విధంగా సాధారణ విమానంలో ప్రయాణించి నేరుగా లొకేషన్‌కు చేరుకున్నాడు. స్టార్డమ్ ప్రదర్శించడం కంటే సినిమా కథ, షూటింగ్ సజావుగా సాగడమే ముఖ్యమని ఆయన తన చేతలతో నిరూపించాడు. కమల్ హాసన్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం పట్ల ప్రొడ్యూసర్స్ మరియు ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ ఖర్చులను తగ్గించేందుకు తోటి నటీనటులకు, స్టార్లకు ఇదొక పెద్ద ఇన్‌స్పిరేషన్ అని కొనియాడుతున్నారు.

తాజా వార్తలు