కమల్ హాసన్ పాపనాశం విడుదల తేది వివరాలు

కమల్ హాసన్ పాపనాశం విడుదల తేది వివరాలు

Published on Jun 3, 2015 2:00 AM IST

Papanasam-Movie

మోహన్ లాల్, మీనా జంటగా నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ యావత్ భారతదేశ సినీ ఇండస్ట్రీకి ఒక కొత్త కధను పరిచయం చేసింది. కమర్షియల్ గా మరియు విమర్శకులను మెప్పించేపరంగా ఈ సినిమా మంచి విజయం సాధించి 2013లో మలయాళ విజయాలలో టాప్ ప్లేస్ సంపాదించుకుంది. తెలుగులో సైతం రిమేక్ అయిన ఈ సినిమాలో వెంకటేష్, మీనా జంటగా నటించారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఇదే స్టోరీని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తమిళనాట ఈ దృశ్యం రీమేక్ లో నటిస్తున్నాడు. పాపనాశం అనే టైటిల్ తో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మీనా పాత్రని గౌతమీ భర్తీ చేయనుంది. ఈ చిత్రం జులై 17న విడుదలకానుంది. ఘిబ్రన్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు