క్రేజీ కాంబినేషన్లో ‘భారతీయుడు’ మళ్ళీ రాబోతున్నాడు !

క్రేజీ కాంబినేషన్లో ‘భారతీయుడు’ మళ్ళీ రాబోతున్నాడు !

Published on Jul 26, 2018 6:09 PM IST

Shankar kamalhassan baratiy

తమిళ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌, కమల్‌ హాసన్‌ ల కలయికలో వచ్చిన చిత్రం భారతీయుడు. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంత కాలంగా ఈ చిత్రానికి సీక్వల్‌ను తెరకెక్కించాలని ఇటు శంకర్‌, అటు కమల్‌ హాసన్‌ కూడా ఇంట్రస్ట్ చూపినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం తెర మీదకు రూపం దాల్చలేదు.

కాగా దర్శకుడు శంకర్‌ 2.ఓ చిత్రీకరణ సమయంలోనే భారతీయుడు సీక్వెల్‌ను తెరూపొందించబోతున్నట్లు తెలిపారు. ఓ సందర్భంలో కమల్‌ తో కలిసి అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ ఇద్దరు బిజీగా ఉండటం వల్ల అనుకున్న విధంగా భారతీయుడు 2 చిత్రం పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే భారతీయుడు 2 మొదలవ్వబోతున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందనుంది.

తాజా వార్తలు