ఈ గోడవంతా ఎందుకని వేరే సినిమా చూసుకున్న కమల్ ?

Published on Jun 10, 2021 3:02 am IST

ఎన్నికలు ముగియడంతో కమల్ హాసన్ సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఆయన చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘ఇండియన్ -2’ కాగా రెండవది ‘విక్రమ్’. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అనేక కారణాల వలన ఆగిపోతూ వస్తున్న ఈ చిత్రం చివరికి కోర్టు గోడవల్లో ఇరుక్కుంది. నిర్మాతకి, దర్శకుడికి గొడవ ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుందో తెలియట్లేదు. అలాగని ‘విక్రమ్’ సినిమా స్టార్ట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ ‘ఇండియన్-2’ పూర్తిచేసే వేరే సినిమాకు వెళ్ళాలి.
ఉన్నట్టుండి సినిమా రీస్టార్ట్ కావొచ్చు. అప్పుడు ‘విక్రమ్’ చిత్రాన్ని అర్థాంతరంగా ఆపాల్సి ఉంటుంది. పైగా ‘విక్రమ్’ సినిమా ప్రధాన తారాగణం డేట్స్ కూడ ఇప్పటికిప్పుడు దొరకడం కష్టం.కాబట్టి ‘ఇండియన్-2’ గొడవ తేలేవరకు కమల్ ఆగాల్సిందే.

అందుకే ఆయన మధ్యేమార్గంగా వేరొక సినిమా చేయాలని అనుకుంటున్నారట. అదే ‘దృశ్యం-2’ తమిళ రీమేక్. డైరెక్టర్ జీతూ జోసెఫ్ మలయాళం, తెలుగు వెర్షన్లను చాలా వేగంగా కంప్లీట్ చేసేశారు. రెండింటినీ లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న టైంలోనే ఫినిష్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాబట్టి ఉన్న ఈ కొద్దిపాటి సమయంలో అతను అయితేనే సినిమా ఫినిష్ చేసి ఇవ్వగలడని నమ్ముతున్నారట కమల్. అంతేకాక గతంలో ‘దృశ్యం’ను తమిళంలోకి ‘పాపనాశనం’ పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు కూడ. కాబట్టి ‘దృశ్యం-2’ రీమేక్ కూడ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం :