కమల్ హాసన్ కోసం డూప్‌ను తీసుకొచ్చారట

కమల్ హాసన్ కోసం డూప్‌ను తీసుకొచ్చారట

Published on Dec 16, 2019 11:58 PM IST

kamal

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇందులో కూడా కమల్ యంగ్, ఓల్డ్ పాత్రల్లో కనిపించనున్నారు. వీటిలో ఓల్డ్ పాత్ర 90 ఏళ్ల వృద్దిడి పాత్ర అని తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చాలానే ఉండనున్నాయి.

కమల్ తన సినిమాలోని పోరాట సన్నివేశాల్లో ఎంత పెద్ద స్టంట్ అయినా పర్ఫెక్షన్ కోసం తానే స్వయంగా చేసుకుంటుంటారు. కానీ ఈసారి కొన్ని క్లిష్టమైన స్టంట్స్ ను కోసం బాడీ డబుల్ ద్వారా చేయిస్తున్నారట. కారణం కొన్నేళ్ల క్రితం కాలికి సర్జరీ జరిగి అందులో అమర్చిన లోహపు భాగాల్ని ఈమధ్యే మరో సర్జరీ ద్వారా తొలగించుకున్నారు. పైగా వయసు మీద పడటం కూడా ఇంకో కారణం. అందుకే ఈసారికి డూప్ ద్వారా ఫైట్స్ కానిచ్చేస్తున్నారట.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతో విడుదల చేయనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు