కన్ఫ్యూజన్లో కమల్ హాసన్

Published on Jun 1, 2021 12:35 am IST

ఎలక్షన్ల హడావుడి ముగియడంతో కమల్ హాసన్ ఫ్రీ అయ్యారు. సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్రజెంట్ ఆయన ముందు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ‘ఇండియన్-2’ కాగా మరొకటి ‘విక్రమ్’. వీటిలో శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఇండియన్-2’ సగం పూర్తికాగా ‘విక్రమ్’ ఆరంభ దశలోనే ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ముందుగా మొదలుపెట్టాలనేదే పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ‘ఇండియన్-2’ లీగల్ సమస్యల్లో చిక్కుకుని ఉంది. లైకా నిర్మాతలు ముందుగా ‘ఇండియన్ -2’ కంప్లీట్ చేసిన తర్వాతే శంకర్ వేరే ప్రాజెక్ట్ చేయాలని కోర్టుకు వెళ్లారు.

శంకర్ సైతం ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశ్యంలోనే ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నారు. దీనికోసమే కమల్ హాసన్ సైతం వెయిట్ చేస్తున్నారు. కోర్టు అనుమతులు వచ్చి ‘ఇండియన్-2’ మొదలయ్యేలా ఉంటే డేట్స్ అన్నీ ఆ సినిమాకు ఇవ్వాల్సిందే. ఒకవేళ ముందుగా ‘విక్రమ్’కు డేట్స్ ఇస్తే అవి మార్చుకుని ‘ఇండియన్-2’కు ఇవ్వాల్సిందే. ఈ క్లాష్ అవాయిడ్ చేయడం కోసమే కమల్ హాసన్ కోర్టు ఉత్తర్వులను బట్టి డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ కూడ కమల్ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :